భారతదేశం, మార్చి 21 -- నాలుగు నెలల్లో విశాఖపట్నం మహా నగరపాలక సంస్థ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తామని.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖ కొత్త మాస్టర్‌ ప్లాన్‌పై సచివాలయంలో ఆయన అధికారులు, విశాఖపట్నం ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.

'మే నెలాఖరులోగా విశాఖపట్నం మెట్రో రైలు టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయించాం. ఫైనాన్షియల్‌ సిటీ విశాఖ మాస్టర్‌ ప్లాన్‌పై సమీక్ష నిర్వహించాం. ప్రజలు, నేతల అభిప్రాయాలతో నాలుగు నెలల్లో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తాం. విశాఖ మెట్రో రైల్‌పైనా సమావేశంలో చర్చించాం. టీడీఆర్‌ బాండ్ల విషయంలో గతంలో అక్రమాలు జరిగాయి. విశాఖలో 600కు పైగా టీడీఆర్‌ బాండ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని విశాఖ కలెక్టర్‌ త్వరగా క్లియర్‌ చేయాలని ఆదేశించాం. భోగాపురం విమానాశ్రయానికి ...