భారతదేశం, ఏప్రిల్ 14 -- విశాఖపట్నం మధురవాడలో నిండు గర్భిణి హత్యకు గురైంది. ఆర్టీసీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గెద్దాడ జ్ఞానేశ్వర్ రావు, ఆయన భార్య అనూష (27) నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కిందట ప్రేమ వివాహం జరిగింది. ప్రస్తుతం అనూష 8 నెలల గర్భిణీ. ఇక్కడిదాకా జీవితం సాఫీగా సాగిపోతోంది. కానీ.. కారణం ఏంటో తెలియదు.. సోమవారం ఉదయం భార్యాభర్తల మధ్య ఇంట్లో గొడవ జరిగింది.

ఈ క్రమంలో జ్ఞానేశ్వర్ రావు.. భార్య అనూష పీక పట్టుకుని గట్టిగా నొక్కాడు. ఆమె ఊపిరి అందక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే స్థానికుల సాయంతో భర్త ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. తర్వాత కేజీహెచ్‌కు తీసుకువెళ్లాడు. అప్పటికే అనూష మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తానే భార్యను చంపేశానని జ్ఞానేశ్వర్ ఒప్పుకున్నాడు. నిందితుడిని పీఎం పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ...