ఆంధ్రప్రదేశ్,విశాఖపట్నం, మార్చి 27 -- విశాఖ‌ప‌ట్నంలో దారుణమైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో మాయ‌మాట‌లు చెప్పి తొమ్మిదో త‌ర‌గ‌తి బాలిక‌పై ఓ వ్య‌క్తి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. బాలిక గ‌ర్భం దాల్చ‌డంతో ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దీంతో నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేశారు.

ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నంలోని ఎంవీపీ కాల‌నీ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో గురువారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. విశాఖ‌లోని ఒక ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక స్థానికంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుతోంది. ఆమె త‌ల్లి, అన్న‌య్య‌తో క‌లిసి నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన వివాహితుడైన సీహెచ్ సీత‌య్య గ‌త ఏడాదిగా బాలిక‌ను ప్రేమ పేరుతో లోబ‌రుచుకుంటున్నాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో బాలిక‌ను వేరేవాళ్ల ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆ త‌రువా...