భారతదేశం, మార్చి 6 -- తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి అని.. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రపంచం పోకడలపై అధ్యయనం చేసి ఇటువంటి పుస్తకం తెలుగులో రాయడం అద్భుతం అని కొనియాడారు. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదని.. అప్పుడూ, ఇప్పుడూ అలాగే ఉన్నారని అన్నారు. విశాఖపట్నంలో మాజీమంత్రి దగ్గబాటి వెంకటేశ్వరరావు రచించిన 'ప్రపంచ చరిత్ర' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.

'కొన్నివేల సంవత్సరాల మానవ పరిణామ క్రమాన్ని, ప్రపంచ చరిత్రను పుస్తక రూపంలో తెలుగులో రచించడం అద్భుత ప్రయత్నం. చరిత్రను ప్రతి ఒక్కరూ చదవాలి. దగ్గుబాటి వెంకటేశ్వరావు పుస్తకం రాస్తారని నేను అనుకోలేదు. స్వతహాగా రచయిత కానటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఎవరూ రాయని విధంగా పుస్తకాన్ని రాశారు. ప్రతి ఇల్లు, ప్రతి లైబ్రరీలో ప...