భారతదేశం, మార్చి 11 -- గాజువాక 65వ వార్డులోని ఒక కాల‌నీలో ప్రాథ‌మిక పాఠ‌శాల‌ ఉంది. ఆ పాఠ‌శాల‌లో విద్యార్థినుల‌కు ఉపాధ్యాయుడు యోగా శిక్ష‌ణ ఇస్తున్నారు. ఈ శిక్ష‌ణ ఇచ్చే క్ర‌మంలో బాలికల‌కు యోగాస‌న‌, శీర్షాస‌నాలు నేర్పిస్తూ అస‌భ్య‌క‌రంగా, అనుచితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఉపాధ్యాయుడి అస‌భ్య‌క‌ర ప్ర‌వ‌ర్త‌న‌పై విద్యార్థినులు త‌ల్లిదండ్రుల‌కు చెప్పారు. త‌మ‌ను యోగా టీచ‌ర్ క్లాస్ స‌మ‌యంలో తాక‌డం వంటివి చేస్తున్నాడ‌ని, త‌మ‌కు చాలా ఇబ్బందిగా ఉంద‌ని చెప్పారు.

విద్యార్థినుల త‌ల్లిదండ్రులు పాఠ‌శాల‌లో జ‌రుగుతున్న ఈ వ్య‌హారాన్ని క‌మిటీ పెద్ద‌ల‌కు దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద‌లతో క‌లిసి పాఠ‌శాల‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంత‌రం స‌దురు ఉపాధ్యాయుడిని మంద‌లించారు. అయినా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌లో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో విద్యార్థినుల త‌ల్లిదండ్రులు, పెద్ద‌లు మం...