భారతదేశం, మార్చి 10 -- విశాఖ‌ప‌ట్నం జిల్లా భీమునిప‌ట్నం మండ‌లం సంగివ‌ల‌స‌లోని అనిల్ నీరుకొండ ఆసుప‌త్రిలో బాలికపై అత్యాచారం జరిగింది. శ‌నివారం రాత్రి జరిగిన ఘ‌ట‌న కాస్తా ఆల‌స్యంగా ఆదివారం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు, ఆసుప‌త్రి సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాలు ప్ర‌కారం.. ఒరిస్సాలోని మ‌ల్క‌న్‌గిరి ప్రాంతం నుంచి 25 మంది చికిత్స నిమిత్తం అనిల్ నీరుకొండ ఆసుప‌త్రికి వ‌చ్చారు. వారికి చికిత్స పూర్తి చేసిన త‌రువాత శ‌నివారం డిశ్చార్జ్ చేశారు.

అయితే చీక‌టి ప‌డ‌టంతో వారు వెళ్ల‌డం క‌ష్ట‌మ‌ని, ఆదివారం ఉద‌యం వెళ్లొచ్చ‌ని సూచించారు. రాత్రి వారిని ఆసుపత్రి ఆరో ఫ్లోర్‌లోని ఉంచారు. అందులో మాన‌సిక దివ్యాంగురాలైన బాలిక వాష్ రూమ్‌కి వెళ్ల‌గా నిందితుడు ఆమె వెంట వెళ్లాడు. ఆమెతో పాటు వాష్ రూమ్‌లోకి దూరి ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆమె కేక‌లు వేయ‌డంతో...