భారతదేశం, ఫిబ్రవరి 15 -- విశాఖ‌ప‌ట్నం జిల్లా గోపాల‌ప‌ట్నంలో తీవ్ర విషాదం జరిగింది. భర్త వేధింపులు తట్టుకోలేక.. నవ వధువు సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. విశాఖ‌ప‌ట్నంకు చెందిన నాగేంద్ర‌బాబుకు, 23 ఏళ్ల యువ‌తితో గ‌తేడాది వివాహం అయింది. నాగేంద్ర‌బాబు ఎల‌క్ట్రీషియ‌న్‌గా ప‌ని చేస్తూ అశ్లీల చిత్రాలకు బానిస అయ్యాడు. రకరకాల మాత్ర‌లు వేసుకుంటూ.. అశ్లీల వీడియోలను భార్య‌కు చూపిస్తూ అలా చేయాల‌ని వేధించేవాడు. అందుకు అతని భార్య నిరాక‌రించేది.

ఈ గురువారం అర్థ‌రాత్రి ఇదే విష‌యమై ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. దీంతో మ‌న‌స్తాపానికి గురైన నాగేంద్ర భార్య శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఆయ‌న వ‌ద్ద ఉన్న ట్యాబ్లెట్ల డ‌బ్బాను స్వాధీనం చేసుకున్నారు...