భారతదేశం, జనవరి 27 -- Visakha Woman Attacked : విశాఖ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మధురవాడలో దంపతులు ఓ మహిళపై విచక్షణా రహితంగా దాడి చేశారు. నడిరోడ్డుపై మహిళ జట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లిన ఘటన సంచలనం అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....మిధిలాపురి వుడా కాలనీ గాంధీవిగ్రహం సెంటర్ వద్ద రెండు బడ్డీలను నాగలక్ష్మి అనే మహిళ నెలవారీ అద్దెకు తీసుకుంది. వీటిలో ఒకదాన్ని మరుపల్లి వెన్నెలకు అద్దెకు ఇచ్చింది. ఈ విషయం అసలు ఓనర్ రమేష్‌కు తెలియడంతో బడ్డీలు ఖాళీ చేయాలని నాగలక్ష్మికి చెప్పాడు.

ఓనర్ బడ్డీలు ఖాళీ చేయమని నాగలక్ష్మి వెన్నెలకు చెప్పింది. అయితే అద్దె లావాదేవీలు ఉండటంతో వెన్నెల ఖాళీ చేసేందుకు అంగీకరించలేదు. దీంతో వీరి మధ్య ఈ నెల 24న గొడవ జరిగింది. మాటా మాట పెరిగి ఘర్షణ పడ్డారు. వెన్నెల దంపతులు నాగలక్ష్మిపై దాడికి దిగారు. మహిళ అని చూడక...