భారతదేశం, ఫిబ్రవరి 17 -- Visakha to Bangkok: విశాఖ నుంచి బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌కు కారు చౌకగా ప్రయాణించే ఆఫర్‌ను ఎయిర్‌ ఏసియా ప్రకటించింది. విశాఖ నుంచి బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌ వెళ్లే వారికోసం స్పెషల్ ఆఫర్‌ అందుబాటులోకి వచ్చింది.

జీరో బేస్ ఫేర్ ఆఫర్‌తో విశాఖప ట్నం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్‌ తో పాటు తిరుచిరాపల్లి నుంచి బ్యాంకాక్‌ ప్రయాణాలకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. 2025 ఫిబ్రవరి 15 నుంచి 23వ తేదీ మధ్య చేసుకున్న బుకింగ్‌లకు ఈ ఆఫర్ చెల్లుబాటులో ఉంటుంది.

ఈ ఏడాది జూలై 1 నుంచి 2026 జూన్ 15 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. తమకు అనువైన తేదీల్లో బుక్‌ చేసుకోవచ్చు. అయితే టిక్కెట్లను మాత్రం ఈ నెల 23వ తేదీలోపు బుక్ చేసుకోవాలని ఎయిర్ ఏసియా సూచించింది.

విశాఖపట్నం నుంచి బ్యాంకాక్ కౌలాలంపూర్‌ వెళ్లేందుకు రూ.7,500 నుంచి రూ.12 వేల వరకు టికెట్ ధర ఉంటుంది. తా...