భారతదేశం, ఏప్రిల్ 2 -- Visakha Knife Attack : విశాఖలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. మధురవాడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని స్వయంకృషి నగర్‌లో ఓ యువతి, ఆమె తల్లిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, యువతికి తీవ్రగాయలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఓ యువకుడు బాధితురాలి ఇంట్లోకి చొరబడి యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు.

దాడి అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తల్లి లక్ష్మి(43) అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన దీపికను స్థానికులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డిగ్రీ చదివిని దీపిక ఇంట్లోనే ఉంటోంది. యువతిని ప్రేమ పేరుతో నవీన్‌ అనే వ్యక్తి వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘట...