భారతదేశం, ఏప్రిల్ 1 -- Visakha Crime : విశాఖ‌ప‌ట్నంలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. యూకేజీ చ‌దువుతున్న ఆరేళ్ల బాలికపై ఉపాధ్యాయుడు లైంగికదాడికి ఒడిగ‌ట్టాడు. విష‌యం తెలుసుకున్న బాలిక త‌ల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహ‌శుద్ధి చేశారు. స్కూల్ సిబ్బంది నుంచి స‌మాచారం అందుకున్న పోలీసులు, వెంట‌నే పాఠ‌శాల‌కు చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. అతడిపై పోక్సో, అత్యాచార‌ కేసు న‌మోదు చేశారు.

ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నం న‌గ‌రంలోని పీఎం పాలె పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా సోమ‌వారం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు తెలిపి వివ‌రాల ప్రకారం జీవీఎంసీ ఏడో వార్డు ప‌రిధిలోని క‌ళా న‌గ‌ర్‌లో ఒక ప్రైవేట్ స్కూల్‌లోని శ్రీ‌కాకుళం జిల్లా పొందూరు మండ‌లం పిల్లల వ‌ల‌స గ్రామానికి చెందిన బుడుమూరు రామ‌చంద్ర‌రావు (27) వ్యాయామ ఉపా...