భారతదేశం, ఏప్రిల్ 12 -- Visakha Crime : వివాహిత‌కి ఫేస్‌బుక్ ద్వారా ప‌రిచ‌యం అయిన జైల‌ర్‌, స్నేహం పేరుతో ఛాటింగ్ ప్రారంభించాడు. ఆపై న్యూడ్ కాల్స్‌, అస‌భ్యక‌ర‌మైన మెసేజ్‌ల‌తో ఆ వివాహిత‌ని జైల‌ర్ వేధిస్తున్నాడు. వివాహిత కుటుంబ స‌భ్యులు హెచ్చరించిన త‌రువాత కొన్ని రోజులు ఆపేసి, మ‌ళ్లీ వేధింపులకు దిగాడు. త‌న‌కు న్యూడ్ కాల్స్ చేస్తే డ‌బ్బులు ఇస్తాన‌ని అస‌భ్య‌క‌రంగా వేధించ‌డంతో ఆ వివాహిత విశాఖ పోలీస్ క‌మిష‌న‌ర్‌కి ఫిర్యాదు చేసింది. దీంతో అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా, జైల‌ర్ ప‌రార‌య్యాడు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం పార్వతీపురం మ‌న్యం జిల్లాలో నివాస‌ముంటున్న వివాహిత‌ ఫేస్‌బుక్ అకౌంట్‌కు అనంత‌పురం జైల‌ర్ సుబ్బారెడ్డి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. అందులో తాను జైల‌ర్‌గా ఉద్యోగం చేస్తున్నాన‌ని సుబ్బారెడ్డి ప‌రిచ‌యం చేసుకున్నాడు. దీంతో ఆమె...