భారతదేశం, మార్చి 28 -- Visakha Airport: విశాఖ విమానాశ్రయంపై నేవీ విధించిన ఆంక్షలు సడలించారు. ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే మరమ్మతుల కోసం గత నాలుగు నెలలుగా పనులు జరుగుతున్నాయి. రన్‌ వే ఉపరితలంపై రీ సర్ఫేసింగ్‌ పనులు పూర్తి అయ్యాయి. దీంతో విమానాల రాకపోకలపై గతంలో నేవీ విధించిన ఆంక్షలను Navy Restrictions తొలగించింది.

ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి విశాఖపట్నం Visakhapatnam విమానాశ్రయంలో 24 గంటలు రాక పోకలకు అవకాశం కల్పిస్తామని విమానయాన సంస్థలకు భారత నేవి సమాచారం అందించింది. దీంతో విమాన యాన సంస్థలు వేసవి షెడ్యూళ్లను రూపొందించాయి.

ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయానికి నిత్యం 30కు పైగా విమానాలు రాకపోకలు సాగుతున్నాయి. మరో నాలుగు షెడ్యూల్ ఖరారు చేశాయి. ఏప్రిల్‌ నుంచి మరో నాలుగు అదనపు సర్వీసులు విశాఖపట్నం నుంచి బయల్దేరే ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

వీటిల...