Hyderabad, ఏప్రిల్ 4 -- ఇండియన్ క్రికెట్‌యే కాదు, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ గురించి ఎవరు మాట్లాడినా విరాట్ కోహ్లీ పేరు ప్రస్తావించకుండా ముగించలేరు. ప్రపంచస్థాయి ప్లేయర్లలో బెస్ట్ గా నిలిచేందుకు విరాట్ మార్చుకున్న లైఫ్ స్టైల్‌యే ప్రధాన కారణం. దీని వల్ల కేవలం ఆటలో పర్ఫామెన్స్ మాత్రమే కాదు ఒక ఫిట్‌నెస్ ఐకాన్‌గా కూడా ఫ్యామస్ అయిపోయాడు. ఆయన తీసుకునే ఆహారం, శారీరక వ్యాయామం, మొత్తం జీవనశైలి మనస్సును నియంత్రణలో ఉంచి టాప్ వన్ గా నిలబెట్టాయి.

మనలో చాలా మంది బిజీ లైఫ్ పేరుతో ఆహారపు అలవాట్ల నుంచి మరెన్నో విషయాలను నిర్లక్ష్య పెడుతున్నాం. వీటి వల్ల శారీరకంగానే కాదు, మానసికంగానూ ఎంతో కోల్పోతున్నాం. ఇటువంటి సమయంలో విరాట్ కోహ్లీ అనుసరిస్తున్న లైఫ్ స్టైల్ తెలుసుకోవడం వల్ల మన గురించి మనం కొంతలో కొంతైనా అప్రమత్తంగా ఉంటాం. మరింకెందుకు ఆలస్యం.. మనకు ప్రేరణ...