Hyderabad, ఫిబ్రవరి 3 -- Aadi Sai Kumar About Akhil Akkineni Virat Kohli: సౌత్, నార్త్ హీరోలంతా కలిసి క్రికెట్ ఆడే తరుణం రానే వచ్చింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 11వ సీజన్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 8 నుంచి సీసీఎల్ 2025 టోర్నమెంట్ మొదలు అవనుంది. బెంగళూరులో ఈ మ్యాచ్‌లు స్టార్ట్ అవుతాయి.

అనంతరం తేదీల వారీగా ఒక్కో ప్రాంతంలో మార్చి 2 వరకు సీసీఎల్ 2025 మ్యాచులు జరగనున్నాయి. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ టీమ్ అయిన తెలుగు వారియర్స్‌కు హీరో అక్కినేని అఖిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరో ఆది సాయి కుమార్, అశ్విన్ బాబు, సామ్రాట్, విశ్వ, సచిన్ జోషి తదితరులు ప్లేయర్స్‌గా సత్తా చాటనున్నారు.

ఇప్పటికీ నాలుగు సార్లు సీసీఎల్ ట్రోఫీని అందుకుంది తెలుగు వారియర్స్ టీమ్. ఇప్పుడు ఈ ఏడాది కప్ కొట్టి ఐదోసారి టైటిల్ గెలిచేందుకు అఖిల్...