Hyderabad, మార్చి 6 -- ఆమె పేరు ప్రతిభ ఝా. బీహార్లోని దర్భంగా ప్రాంతానికి చెందిన ఒక ఇల్లాలు. ఆమె పుట్టిల్లు ముజఫర్పూర్‌లో ఉంది. తన ఊర్లోనే రైతులను చూస్తూ పెరిగింది ప్రతిభ. పుట్టగొడుగులు పండించడం కూడా చూసింది. అవంటే చిన్నప్పుడు నుంచి ఆసక్తి ఎక్కువగా ఉండేది. అవి ఎలా పెరుగుతాయో, ఎలా పెంచుతారో అన్న ఆసక్తి ఆమెలో ఎప్పటికప్పుడు వచ్చేది.

కానీ ఆమె జీవితం అకస్మాత్తుగా మలుపు తిరిగింది. ఆమె తండ్రి మరణం ఆమెకు ఆనందాన్ని దూరం చేసింది. తండ్రి లేని కూతురు కావడంతో 15 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. గ్రామంలో ఉన్న తన భర్త ఇంట్లోనే ఆమె అత్తమామలతో కలిసి జీవించేది. వంట, ఇంటి పనులు తప్ప ఇంకేమీ చేసేది కాదు. కానీ పుట్టగొడుగుల పెంపకం అనేది మాత్రం ఇంకా ఆమె మెదడులో మెదులుతూనే ఉంది.

పిల్లలు పుట్టి వారు స్కూలుకు వెళ్లే వయసు వచ్చింది. ఆ సమయంలో ఆమెకు మళ్ళీ పుట్టగొడుగులను ...