భారతదేశం, జనవరి 28 -- ఒక మంచి ఎకో టూరిజం పార్క్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వికారాబాద్ సమీపంలో ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించిన సీఎం.. ప్రజా ప్రభుత్వం ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లిందని వివరించారు. రాష్ట్రంలో టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు.

'టెంపుల్, ఎకో టూరిజం రాష్ట్రానికి గుర్తింపుతో పాటు.. ఆదాయం పెరగడానికి ఉపయోగపడుతుంది. దేవాలయ దర్శనాలకు, అటవీ సంపదను చూసేందుకు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాం. రామప్ప, వేయిస్తంభాల గుడి లాంటి అద్భుతమైన ఆలయాలు తెలంగాణలో ఉన్నాయి. నల్లమల అడవులు, మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది' అని రేవంత్ స్ప...