భారతదేశం, ఫిబ్రవరి 7 -- కోల్‌కత్తా- చెన్నై ఎన్‌హెచ్ 16 జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా విజయవాడలో మరీ ఎక్కువ. ఈ పరిస్థితి చెక్ పెట్టాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా.. జాతీయ రహదారిపై రద్దీని తగ్గించడానికి బైపాస్ రోడ్డును నిర్మించాలని సంకల్పించింది. దీని ద్వారా విజయవాడ నగరంలోకి వెళ్లకుండానే హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై వెళ్లేలా నిర్మాణం చేపట్టారు.

అమరావతికి కనెక్టివిటీ పెంచడం కోసం 20017లో అప్పటిలో ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందించింది. గన్నవరం సమీపంలోని చిన్న అవుటుపల్లి నుంచి.. మంగళగిరి సమీపంలోని కాజా టోల్‌గేట్ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ప్రతిపాదించింది. 47 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మించాలని ప్లాన్ చేశారు. దీనికోసం భూసేకరణ చేసి.. ఆరు వరుసల నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ సిద్ధం చేసి.. అప్పటి కేంద్ర ప్రభుత...