భారతదేశం, మార్చి 4 -- Vijayawada Police: విజయవాడలో ట్రాఫిక్‌ చలాన్లు, నిబంధనల ఉల్లంఘన, హెల్మెట్ లేకుండా వాహనాలను నడిపే వారిని పోలీసులు ప్రశ్నించే వీడియోలు ఇటీవల కాలంలో వైరల్‌ అవుతున్నాయి. మహిళలు, వృద్ధులు, ఉద్యోగుల వాహనాలను తనిఖీ చేసే సమయంలో నిబంధనల్ని ఉల్లంఘిస్తే వారికి జరిమానా విధిస్తున్నారు. జరిమానాలతో పాటు ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించిన వారి వీడియోలను పోలీసులే సోషల్‌ మీడియాలో షేర్ చేయిస్తున్నారు.

ట్రాఫిక్ నిబంధనల్ని కఠినంగా అమలు చేసే విషయంలో ఎవరికి అభ్యంతరం లేకున్నా, చలానాలను విధించే సమయంలో పోలీసులు బాడీ కెమెరాలతో రికార్డు చేస్తున్న వీడియోలు, మొబైల్ ఫోన్లలో రికార్డు చేసే వీడియోలను యూ ట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లతో షేర్‌ చేస్తున్నారు. ఈ తరహా వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని సైతం మీడియా ముందు ప్...