భారతదేశం, ఫిబ్రవరి 11 -- విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. గతంలో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చినా.. అడుగు పడలేదు. తాజాగా మళ్లీ భూసేకరణపై ఏపీఎంఆర్‌సీ అధికారులు దృష్టిపెట్టారు. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో దాదాపు 90 ఎకరాలు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌కు దీన్ని సమర్పించారు. దీనికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి రెండు కారిడార్లలో 34 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. గతంలో భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చి, టెండర్లను పిలిచారు. వివిధ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. దీంతో మళ్లీ మొదటి నుంచి భూసేకరణ ప్రక్రియను ప్రారంభించారు.

2.ఇప్పటికైతే.. దాదాపు 90 ఎకరాల భూమి అవసరం అని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భూమిని సేకరి...