భారతదేశం, మార్చి 10 -- Vijayawada Metro: ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీల్లో భాగమైన విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టుల డిపిఆర్‌‌లో విజయవాడ నగరంలో ప్రతిపాదించిన అలైన్మెంట్‌ చర్చనీయాంశంగా మారింది. విజయవాడలో సగం నగరాన్ని పూర్తిగా విస్మరించి తొలిదశ మార్గాన్ని ప్రతిపాదించడంతో దాని అసలు లక్ష్యం ఎంత మేరకు సాధ్యమవుతుందనే చర్చ జరుగుతోంది.

విజయవాడ మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదనలకు పదేళ్లు నిండి పోయాయి. ఢిల్లీ మెట్రో పాజెక్టుతో పాటు కొంకణ్‌ రైల్వే ప్రాజెక్టుల్ని తీర్చిదిద్దిన శ్రీధరన్‌ నేతృత్వంలో తొలిదశలో విజయవాడ మెట్రో చర్చలు నడిచాయి. ఆ తర్వాత విజయవాడ మెట్రో చర్చల నుంచి శ్రీధరన్‌ తప్పుకున్నారు. ఆయన స్థానంలో హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన రామకృష్ణా రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

విజయవాడ మెట్రో ప్రాజెక్టు కసరత్తు మొదట్లో శరవేగంగా జరిగినా ఆ ...