భారతదేశం, మార్చి 29 -- Vijayawada Hackers Protest : విజయవాడ ధర్నా చౌక్ లో వందలాది మంది వీధి వ్యాపారులు, హ్యాకర్లు.... విజయవాడ హ్యాకర్లు, తోపుడుబండ్ల యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అధికార పార్టీ నేతలు దౌర్జన్యాల నుంచి కాపాడాలని నినాదాలతో హోరెత్తించారు. తమకు రక్షణ కల్పించాలని, జీవనోపాధిని కాపాడాలని నినదించారు. నగరంలోని పలు సెంటర్ల నుండి పెద్ద ఎత్తున హ్యాకర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీఎం, సీఐటీయూ, యూనియన్ నేతలు మాట్లాడుతూ ... ఒకవైపున కూటమి ప్రభుత్వం P4 పేరుతో పేదరిక నిర్మూలన చేస్తామని ప్రకటిస్తుంటే విజయవాడలో అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు కొందరు చిరు వ్యాపారులపై దౌర్జన్యం చేస్తూ, దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నేతలు.. వ్యాపారుల పొట్టగొట్టి లక్షలు గడ...