భారతదేశం, మార్చి 11 -- Vijayawada Concerns: ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి పదేళ్లు పూర్తైనా ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ స్థాయిలో కాకున్నా అందులో పదో వంతు కూడా ఏపీలో నగరాలు అభివృద్ధి చెందలేదు.

విజయవాడ నగరానికి పొరుగునే ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని నగరం అమరావతి ఉంది. అమరావతి కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నా విజయవాడ రూపు రేఖలు మార్చే ప్రయత్నాలు మాత్రం జరగవు. విభజన తర్వాత పదేళ్లుగా విజయవాడ కేంద్రంగానే పాలనా వ్యవహారాలు సాగుతున్నా దానిని బాగు చేసే ఆలోచన మాత్రం పాలకుల్లో కనిపించడం లేదు.

2014 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. కేంద్ర, రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆంధ్రప్రదేశ్‌ తలరాత మారిపోతుందని అంతా భావించారు. 2014 డిసెంబర్‌లో రాజధాని ప్రాంతంపై స్పష్టత వచ్చింది....