భారతదేశం, మార్చి 4 -- పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. విజ‌య‌వాడ‌కు చెందిన బాలిక ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతోంది. ఆమెకు సోష‌ల్ మీడియాలో తెలంగాణ‌లోని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా మోత్కూరు మండ‌ల కేంద్రానికి చెందిన కందుకూరి మున్నాతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ప‌రిచ‌యం కొన్ని రోజుల‌కు ప్రేమ‌గా మారింది. గతేడాది డిసెంబ‌ర్ 30వ తేదీన బాలిక కాలేజీకి వెళ్తున్నాన‌ని త‌ల్లిదండ్రుల‌కు చెప్పి.. ప్రియుడు మున్నా స్వ‌స్థ‌లం మోత్కూరుకు వెళ్లింది.

అప్ప‌టి నుంచి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని స‌దరు బాలిక‌, మున్నా స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. అయితే బాలిక ఆచూకీ తెలియక త‌ల్లిదండ్రులు ఆందోళ‌నకు గుర‌య్యారు. తన త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కు గుర‌వుతార‌ని భావించిన బాలిక.. త‌ల్లి ఫోన్ చేసి విష‌యం చెప్పింది. ఇలా అప్పుడ‌ప్పుడు మాట్లాడేది. తాను బాగానే ఉన్నాన‌ని, మున్నా అనే య...