భారతదేశం, మార్చి 25 -- వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్‌ పొడిగించింది. వచ్చేనెల 4 వరకు రిమాండ్‌ పొడిగించింది. వంశీతో పాటు మరో నలుగురికి కూడా రిమాండ్ పొడిగించింది. సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో వంశీ రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. అటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. సీఐడీ కోర్టు తీర్పును ఈ నెల 27కు రిజర్వ్‌ చేసింది.

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేశారంటూ వంశీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో వంశీతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో సత్యవర్ధన్ ఫిర్యాదుతో వంశీ తోపాటు 87 మంది నిందితులపైనా అట్రాసిటీ కేసులు నమోదు ...