భారతదేశం, మార్చి 30 -- విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ప్రసాదంలో మేకు దర్శనమిచ్చింది. దీంతో అధికారుల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. మహా మండపం కింద 4వ కౌంటర్‌లో భక్తులు పులిహోర పొట్లాలు కొనుగోలు చేశారు. ప్రసాదం తింటుండగా మేకు రావడంతో భక్తుడు షాకయ్యాడు. అమ్మవారి ప్రసాదాన్ని అపరిశుభ్రంగా తయారు చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇంద్రకీలాద్రి దుర్గాదేవి ఆలయం పులిహోర ప్రసిద్ధి చెందింది. అమ్మవారికి సమర్పించే ఈ పులిహోరను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరిస్తారు. ఈ పులిహోరలో ఉపయోగించే పదార్థాలు, వాటి మిశ్రమం ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. చింతపండు గుజ్జు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు వంటి వాటిని సరైన పాళ్ళలో కలపడం వల్ల పులిహోర రుచి అద్భుతంగా ఉంటుంది.

ఇంద్రకీలాద్రి అమ...