Hyderabad, ఏప్రిల్ 13 -- Vijayashanthi Comments In Arjun Son Of Vyjayanthi Pre Release Event: స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి ఇటీవల కాలంలో కీలక పాత్రలు పోషిస్తూ నటిగా అలరిస్తున్నారు. అలా ఇది వరకు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు మూవీ చేశారు విజయశాంతి.

లేటెస్ట్‌గా తెలుగులో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో నటించారు విజయశాంతి. ఇందులో హీరో అయిన నందమూరి కల్యాణ్ రామ్‌కు తల్లిగా యాక్ట్ చేశారు విజయశాంతి. తాజాగా శనివారం (ఏప్రిల్ 13) అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీపై, ఈ సినిమాలోని పాత్రపై ఇంట...