భారతదేశం, ఏప్రిల్ 19 -- నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఈ శుక్రవారం ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. యాక్షన్, మదర్ సెంటిమెంట్‍తో ఉన్న ఈ చిత్రం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీనియర్ నటి విజయశాంతి ఈ మూవీలో హీరో తల్లిపాత్ర పోషించారు. పవర్‌ఫుల్ రోల్ చేశారు. అయితే, ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా సక్సెస్ మీట్ నేడు (ఏప్రిల్ 19) జరిగింది. ఈ ఈవెెంట్‍లో విజయశాంతి మాట్లాడారు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారిపై విజయశాంత్ ఫైర్ అయ్యారు. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ మూవీని కావాలనే కొందరు డిస్ట్రబ్ చేసేందుకు చూస్తున్నారని చెప్పారు. ఏ సినిమానైనా కష్టపడి చేస్తారని, కావాలని నెగెటివిటీ వ్యాప్తి చేయడం కరెక్ట్ కాదని అన్నారు. బాగున్నా సినిమాను బాగాలేదని ప్రచా...