ఆంధ్రప్రదేశ్,అమరావతి, మార్చి 16 -- వైసీపీ నుంచి బయటికి వెళ్లిన తర్వాత విజయసాయిరెడ్డి నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన చెప్పినప్పటికీ.. పొలిటికల్ రీఎంట్రీపై అనేక విశ్లేషణలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశిస్తూ.. ఆయన చుట్టూ కోటరీ చేరిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చుట్టూ చేరిన కోటరీ నుంచి బయటపడితేనే జగన్‌కు భవిష్యత్తు ఉంటుందంటూ హితవు పలికిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా ట్విట్టర్ వేదికగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తిరరమైన కథను పోస్ట్ చేశారు. ఇందులో కూడా ప్రధానంగా కోటరీ అనే విషయాన్ని ప్రస్తావించారు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలని. ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలని పేర్కొన్నారు. లేకపోతే కోటనే ఉండదంటూ రాసుకొచ్చారు.

"పూర్వకాలంలో మహా...