ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 7 -- ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీలో చక్రం తిప్పిన చాలా మంది నేతలు ఒక్కొక్కరిగా బయటికి వెళ్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఇదే జాబితాలోకి ఇటీవలే విజయసాయిరెడ్డి కూడా చేరిపోయారు. రాజకీయాలకే దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. పదవులతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

విజయసాయిరెడ్డి పార్టీ చేరకముందే.పలువురు రాజ్యసభ సభ్యులు కూడా వైసీపీని వీడారు. ఓవైపు కీలక నేతలు పార్టీని వీడుతున్నప్పటికీ. వైసీపీ నేతల రియాక్షన్ మరోలా ఉంటుంది. ఎంతమంది నేతలు బయటికి వెళ్లినా. పార్టీకి వచ్చే నష్టం ఏం లేదంటూ చెప్పుకొస్తున్నారు. అయితే గురువారం మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ అధినేత జగన్. కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్టీని వీడిన ఎంపీలు, నేతలను ఉద్దేశిస్తూ "పార్టీ నుంచి పోయ...