భారతదేశం, జనవరి 25 -- వైఎస్ వివేకా ఘటనపై విజయసాయి రెడ్డి స్పందించారు. వివేకానందరెడ్డి చనిపోయినట్టు తెలిసి షాకయ్యానని వ్యాఖ్యానించారు. వెంటనే అవినాష్‌ రెడ్డికి ఫోన్‌ చేసి అడిగానని.. అవినాష్‌ మరో వ్యక్తికి ఫోన్‌ ఇచ్చారని వెల్లడించారు. గుండెపోటుతో వివేకా చనిపోయినట్టు తనకు చెప్పారన్న విజయసాయి.. ఫోన్‌లో వచ్చిన సమాచారమే మీడియాకు చెప్పానని స్పష్టం చేశారు.

శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయి.. తన రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారని వెల్లడించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 'పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశా. జగన్‌తో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేశా. భవిష్యత్‌లో రాజకీయాల గురించి మాట్లాడను. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అప్రూవర్‌గా మారలేదు. వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియవు' అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ...