భారతదేశం, జనవరి 27 -- Vijaya Saireddy Reasons: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహార ఆ పార్టీ శ్రేణులకు, నాయకులకు మింగుడు పడటం లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి రాజీనామా అనూహ్యంగా జరిగిందేమి కాదనే అనుమానం వైసీపీలో ఉంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో సాయిరెడ్డి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడం మర్నాడు రాజ్యసభలో రాజీనామా లేఖను అందించిన వెంటనే దానిని అమోదించడం వెనుక జరిగిన పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.

వైసీపీ ఓటమి తర్వాత సాయిరెడ్డికి తిరిగి ఉత్తరాంధ్ర బాధ్యలు అప్పగించినా సాయిరెడ్డి ఎందుకు పార్టీని వీడారనే సందేహాలు వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాజీనామా నిర్ణయాన్ని జగన్మోహన్‌ రెడ్డికి ఫోన్‌లో వివరించిన సమయంలో ఈ సమయంలో పార్టీని వీడి వెళ...