Hyderabad, మే 18 -- Vijay Sethupathi Ace Title Teaser Out: కోలీవుడ్ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న సరికొత్త సినిమా ఏసీఈ. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇలా విజయ్ సేతుపతి, రుక్మిణి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమాకు ఆరుముగ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, రుక్మిణితోపాటు కమెడియన్ యోగి బాబు, పి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, రాజ్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరణ్ బహదూర్ రావత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనింగ్ ఎ.కె. ముత్తు, ఆర్. గోవిందరాజ్ ఎడిటింగ్ వర్క్స్ చేస్తున్నారు.

'ఏసీఈ' అనే డిఫరెంట్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ కంప్...