భారతదేశం, సెప్టెంబర్ 28 -- తమిళనాడులోని కరూర్‌లో సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్​కి చెందిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు.

టీవీకే పార్టీ నిర్వహించిన ఈ ర్యాలీలో ఒక్కసారిగా జనసందోహం పెరిగి తొక్కిసలాటకు దారితీసింది.

మృతుల్లో 16 మంది మహిళలు, తొమ్మిది మంది పురుషులు, ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ ధృవీకరించారు.

జిల్లా యంత్రాంగం 'తొక్కిసలాట లాంటి క్రష్​'గా పేర్కొన్న ఈ ఘటన కరూర్-ఈరోడ్ జాతీయ రహదారిపైని వెలుసామీపురం వద్ద జరిగింది.

విజయ్ చేపట్టిన 'వెళిచ్చం వెళియెరు' ('వెలుగు రావాలి') ప్రచార సమావేశానికి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. విజయ్ ప్రసంగిస్తుండగా, సభలో ఒక్కసారిగా గ...