భారతదేశం, ఏప్రిల్ 7 -- cరౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారని కొన్నేళ్లుగా రూమర్లు ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసి చాలాసార్లు వెకేషన్లకు వెళ్లారు. కలిసి పండుగలు చేసుకున్నారు. కానీ తమ రిలేషన్‍ను మాత్రం ఇద్దరూ కన్ఫర్మ్ చేయలేదు. వారు పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలతు.. నెటిజన్లు చాలాసార్లు పట్టేశారు. తాజాగా రష్మిక తన పుట్టిన రోజును విజయ్‍తో కలిసి చేసుకున్నారని తెలుస్తోంది. వారు పోస్ట్ చేసిన ఫొటోలే ఈ రూమర్లకు కారణమయ్యాయి. ఆ వివరాలివే..

రెండు రోజుల కింద ఏప్రిల్ 5న తన 29వ పుట్టిన రోజును జరుపుకున్నారు రష్మిక మందన్నా. ఒమన్‍లో సెలెబ్రేట్ చేసుకున్నారు. బర్త్ డే సందర్భంగా ఒమన్‍లోని ఓ బీచ్‍లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు రష్మిక.

ఒక్క రోజు గ్యాప్‍తో విజయ్ దేవరకొండ కూడా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బా...