భారతదేశం, ఫిబ్రవరి 17 -- Vijay Deverakonda Maha Kumbh: మహా కుంభమేళాలో ఇప్పటికే 50 కోట్లకుపైగా జనం పుణ్య స్నానాలు ఆచరించిన విషయం తెలుసు కదా. తాజాగా రౌడీ బాయ్, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కూడా తన తల్లి, స్నేహితులతో కలిసి ప్రయాగ్ రాజ్ వెళ్లాడు. అక్కడి త్రివేణీ సంగమంలో భక్తిగా స్నానం చేశాడు. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాలో అతడు షేర్ చేశాడు.

ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేళా ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు, భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి చిహ్నం కూడా. కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తుంటారు. ఈ సారి మహాకుంభ్ 2025 లో బాలీవుడ్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు తారలు కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగమయ్యారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన తల్లి మాధవితో కలిసి గంగానదిలో స్నానమాచర...