భారతదేశం, మార్చి 13 -- Vijay Antony: విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టిస్తోన్న 25వ మూవీ భ‌ద్ర‌కాళి. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి అరుణ్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హీరోగా న‌టిస్తూనే స్వీయ నిర్మాణ సంస్థ‌పై విజ‌య్ ఆంటోనీ భ‌ద్ర‌కాళి సినిమాను నిర్మిస్తోన్నారు. భ‌ద్ర‌కాళి మూవీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకే రోజు రిలీజ్ కాబోతోంది.

భ‌ద్ర‌కాళి తెలుగు టీజ‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. 'పిల్లి కూడా ఒక రోజు పులి అవును.. అబద్దం, అహంకారం అంతం అవును'.. అంటూ టీజ‌ర్ ప్రారంభ‌మైంది. రాజ‌కీయాల్లోని అవినీతిని టీజ‌ర్‌లో చ‌ర్చించారు. సెక్రటేరియెట్‌లో టీలు అమ్మిన ఓ కుర్రాడు, రాష్ట్ర రాజ‌కీయాల‌నే శాసించే స్థాయికి ఎలా ఎదిగాడ‌న్న‌ది ఈ మూవీలో చూపించ‌బోతున్న‌ట్లు టీజ‌ర్‌ చూస్తుంటే తెలుస్తోంది.

ఈ టీజర్‌లో విజయ్ ఆంటోని అసలు ఏ పాత్రను పోషిస్తున్నాడో రివీల...