భారతదేశం, ఫిబ్రవరి 6 -- కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కొంత గ్యాప్ త‌ర్వాత విదాముయార్చి మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ తెలుగులో ప‌ట్టుద‌ల పేరుతో రిలీజైంది. త్రిష హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో అర్జున్‌, రెజీనా కీల‌క పాత్ర‌లు పోషించారు. మ‌గీజ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించింది. గురువారం విడుద‌లైన విదాముయాచ్చి మూవీ ఎలా ఉందంటే?

అర్జున్ (అజిత్‌) క‌య‌ల్‌(త్రిష‌) ప్రేమించి పెళ్లిచేసుకుంటారు. సంతోషంగా సాగిపోతున్న వారి కాపురంఅజ్ఞాత వ్య‌క్తి కార‌ణంగా అనుకోని మ‌లుపులు తిరుగుతుంది. అర్జున్‌కు విడాకులు ఇవ్వాల‌ని క‌య‌ల్ నిర్ణ‌యించుకుంటుంది. అర్జున్ మాత్రం భార్య‌కు దూరం కావ‌డానికి ఒప్పుకోడు. భార్య‌ నిర్ణ‌యంలో మార్పు రాక‌పోవ‌డంతో చివ‌రి సారిగా క‌లిసి ఓ టూర్‌కు వెళ‌దామ‌ని క‌య‌ల్‌ను ...