భారతదేశం, ఫిబ్రవరి 7 -- అజిత్ విదాముయార్చి మూవీ (తెలుగులో ప‌ట్టుద‌ల‌) తొలిరోజు బాక్సాఫీప్ వ‌ద్ద తేలిపోయింది. అజిత్‌కు త‌మిళంలో ఉన్న క్రేజ్‌, పోటీగా పెద్ద సినిమాలు లేక‌పోవ‌డంతో విదాముయార్చి మూవీ ఫ‌స్ట్ డే రికార్డు క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంద‌ని ఫ్యాన్స్ భావించారు.కానీ ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కార‌ణంగా అంచ‌నాల్ని అందుకోలేక బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిలా ప‌డింది.

మొద‌టిరోజు విదాముయార్చి మూవీ వైర‌ల్డ్ వైడ్‌గా ఇర‌వై రెండు కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.అందులో త‌మిళ వెర్ష‌న్ క‌లెక్ష‌న్స్ 21.50 కోట్లు ఉండ‌గా...తెలుగు వెర్ష‌న్‌కు కేవ‌లం యాభై ల‌క్ష‌లు మాత్ర‌మే రాబ‌ట్టింది.

విదాముయార్చి మూవీ ప‌ట్టుద‌ల పేరుతో తెలుగులో డ‌బ్ అయ్యింది. అజిత్‌కు తెలుగులో స‌రైన మార్కెట్ లేక‌పోవ‌డం, ప్ర‌మోష‌న్స్ అస‌లే చేయ‌క‌పోవ‌డంతో ప‌ట్టుద‌ల బాక్సాఫ...