భారతదేశం, ఫిబ్రవరి 11 -- వెస్పా తన 2025 మోడల్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. 2025 వెస్పా లైన్‌అప్‌లో కొత్త టెక్నాలజీ కూడా ఉంది. కొనుగోలుదారులను మరింత ఆకర్షించేందుకు ప్రత్యేక ఎడిషన్లను కూడా కంపెనీ అందిస్తోంది. 2025 వెస్పా లైన్‌అప్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 1.32 లక్షలు. టాప్ వేరియంట్ ధర రూ.1.96 లక్షల వరకు ఉంటుంది. కంపెనీ ఇందులో స్మూత్ యాక్సిలరేషన్, హై గ్రేడబిలిటీ కోసం కొత్త ఇంజిన్‌ను అందించింది.

వెస్పా 125 2025 వేరియంట్ లైనప్‌లో ఇప్పుడు వెస్పా, వెస్పా ఎస్, వెస్పా టెక్, వెస్పా ఎస్ టెక్ ఉన్నాయి. బేస్ వెర్షన్ అదే డిజైన్‌తో కొనసాగుతుంది. వెస్పా, వెస్పా ఎస్ లను 125cc, 150cc ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంచారు.

వెస్పాలో వెర్డే అమాబిల్, రోస్సో రెడ్, పెర్ల్ వైట్, నీరో బ్లాక్, అజురో ప్రోవెన్జా, బ్లూ, పెర్ల్ వైట్, ఆరెంజ్, పెర్ల్ వైట్ వంటి రంగులు అంద...