భారతదేశం, డిసెంబర్ 12 -- Venus Combust: గ్రహాలు కాలనుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహ సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిస్తుంది. 12 రాశుల వారు శుభ ఫలితాలను లేదా అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శుక్రుడు కూడా ఎప్పటికప్పుడు తన రాశులను మారుస్తూ ఉంటాడు. శుక్ర సంచారంలో మార్పు వచ్చినప్పుడు కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

శుక్రుడు ఆనందం, ప్రేమ, డబ్బు, విలాసాలు వంటి వాటికి కారకుడు. శుక్రుడి రాశి మార్పు చెందినప్పుడు ప్రతి వ్యక్తి కూడా శుభ ఫలితాలు లేదా అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శుక్రుడు అస్తమించాడు. శుక్రుడి అస్తమయం కొన్ని రాశుల వారికి అనేక లాభాలను తీసుకురాబోతోంది. మరి ఏ రాశి వారు ఎలాంటి లాభాలను పొందుతారు? ఎవరికి బాగా కలిసి రాబోతోందో...