తెలంగాణ,వేములవాడ, మార్చి 1 -- మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగి జాతరకు భారీగా భక్తులు తరలివచ్చారు. రెండు లక్షల 60 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. కోరిన కోర్కెలు తీర్చే కోడెమొక్కుల రాజన్నను శివరాత్రి సందర్భంగా దర్శించుకున్న భక్తుల తో ఆలయానికి కోటి 30 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు.

మహాశివరాత్రి జాతర ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడిన వినోద్ రెడ్డి.. మహాశివరాత్రి మూడు రోజులపాటు ప్రసాదాల అమ్మకం, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా ఒక కోటి 30 లక్షల ఆదాయం వచ్చినట్లు వివరించారు. ప్రసాదాల అమ్మకం ద్వారా 57 లక్షల 12 వేలు, కోడెముక్కు ద్వారా 45 లక్షల 83 వేలు, కేశఖండనం ద్వారా ఆరు లక్షల 89 వేలు, 100 రూపాయల శీఘ్ర దర్శనం...