భారతదేశం, జనవరి 21 -- Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మహిళా కమిషన్ కు బహిరంగ క్షమాపణలు చెప్పారు. హీరో నాగచైతన్య-శోభిత విడాకులు తీసుకుంటారని జోస్యం చెప్పిన వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. నోటీసులపై ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ.. తప్పనిసరిగా మహిళా కమిషన్ ఎదుట హాజరుకావాలని కోర్టు వేణుస్వామిని ఆదేశించింది. దీంతో ఇవాళ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద ఎదుట హాజరై.. తాను మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని, క్షమాపణలు చెబుతూ లేఖ అందించారు.

హీరో నాగచైతన్య-శోభిత పెళ్లి సమయంలో జ్యోతిష్యుడు వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యా్ఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్‌ సీరియస్ అయ్యింది. తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్‌ చేస్తూ వేణుస్వామి తెలంగ...