భారతదేశం, ఫిబ్రవరి 1 -- Venkatesh Brother: ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంక‌టేష్‌తో పాటు రానా ద‌గ్గుబాటి, అత‌డి సోద‌రుడు అభిరామ్ యాక్ట‌ర్లుగా మారారు. హీరోగా టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అందుకున్నాడు వెంక‌టేష్‌. టాప్ హీరోల్లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నాడు. రానా కూడా వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా నిరూపించుకున్నాడు. ద‌గ్గుబాటి ఫ్యామిలీకి చెందిన ఓ యాక్ట‌ర్ తెలుగులో కాకుండా త‌మిళంలో హీరోగా ఫేమ‌స్ అయ్యాడు. అత‌డు మ‌రెవ‌రో కాదు ద‌గ్గుబాటి రాజా.

నిర్మాత రామానాయుడు అన్న కొడుకు అయిన రాజా త‌మిళంలో అర‌వైకిపైగా సినిమాలు చేశాడు. అందులో హీరోగా 30 వ‌ర‌కు సినిమాలు ఉన్నాయి. భార‌తీరాజా, మ‌ణిర‌త్నం వంటి అగ్ర ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేశాడు. విజ‌య్ కాంత్‌, ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ హీరోలుగా న‌టించిన ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల్లో కీల‌క పాత్ర‌లు చేశాడు.

1981లో క్రైమ్ థ్రి...