భారతదేశం, జనవరి 27 -- విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అంచనాలకు మించి భారీ బ్లాక్‍బస్టర్ కొట్టేసింది. సంక్రాంతి రేసులో జనవరి 14న విడుదలైన ఈ చిత్రం ఆశ్చర్యపరిచే కలెక్షన్లను సాధించింది. ఇప్పటికే రూ.260 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటినట్టు మూవీ టీమ్ వెల్లడించింది. ఆ రేంజ్‍లో ఈ చిత్రం భారీ సక్సెస్ సాధించింది. ఈ తరుణంలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా సక్సెస్ ఈవెంట్ భీమవరంలో గ్రాండ్‍గా జరిగింది. బ్లాక్‍బస్టర్ సంబరం పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. వెంకటేశ్ స్పీచ్ అదరగొట్టేశారు.

సక్సెస్ ఈవెంట్‍లో ఫుల్ ఎనర్జీతో అదరగొట్టారు వెంకటేశ్. సరదాగా స్పీచ్ ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఇంత బ్లాక్‍బస్టర్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. తన స్పీచ్‍లో హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి గురించి సరదా కామెంట్లు చే...