Hyderabad, మార్చి 1 -- Venkatesh About Sankranthiki Vasthunnam OTT Release: సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి హీరోగా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం జీ5, జీ తెలుగు రెండింట్లోనూ ఏకకాలంలో ప్రీమియర్‌గా ఇవాళ (మార్చి 1) ప్రదర్శించనున్నారు.

థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఈ మూవీని జీ తెలుగులో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. టీవీ ప్రీమియర్‌తో పాటుగా జీ5 ఓటీటీలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో డబ్బింగ్ వెర్షన్‌లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ క్రమంలో జీ5 ప్రతినిధి మాట్లాడుతూ.. "జీ5, జీ తెలుగు రెండింటిలోనూ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మా ప్రేక్షకులకు అందించడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న ...