Hyderabad, ఫిబ్రవరి 24 -- Comedian Sapthagiri Movie With Venkatesh Role Name Title: హీరో విక్టరీ వెంకటేష్ ఎన్నో విభిన్నపాత్రలు చేసి అలరించారు. ఆయన చేసిన ఐకానిక్ పాత్రలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటే పెళ్లి కాని ప్రసాద్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సినిమా మళ్లీశ్వరి.

మళ్లీశ్వరి మూవీలో పెళ్లి కాని ప్రసాద్‌గా వెంకటేష్ పాత్ర చాలా బాగా పండింది. ఇప్పటికీ పెళ్లి కానీ యువకులను ఆ పేరుతోనే సరదాగా పిలుస్తుంటారు. ఇప్పుడు ఆ పెళ్లి కాని ప్రసాద్ అనే టైటిల్‌తోనే ఓ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కమెడియన్ సప్తగిరి హీరోగా చేశాడు. సప్తగిరికి జోడీగా ప్రియాంక శర్మ హీరోయిన్‌‍గా నటించింది.

అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో అవుట్-అండ్-అవుట్ ఎంటర్టైనర్‌గా పెళ్లి కాని ప్రసాద్ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని విజన్ గ్రూప్‌కు చెందిన కెవై బా...