తెలంగాణ,వేములవాడ, ఏప్రిల్ 17 -- Seeta Rama Kalyanam at Vemulawada: శ్రీరామనవమికి ప్రపంచవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం జరుగుతుంటే దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ(Vemulawada)లో వింత ఆచారం కొనసాగుతుంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఓ వైపు సీతారాముల కళ్యాణం జరిగే శుభముహూర్తాన మరోవైపు శివపార్వతులుగా పిలువబడే జోగినిలు, హిజ్రాలు శివుడిని వివాహం చేసుకున్నారు. ఒకే వేదికపై రెండు వివాహ సన్నివేశాలు వేములవాడలో ప్రతి ఏటా శ్రీరామనవమికి కన్నుల పండువలా జరుగుతాయి. అనేక దశాబ్దాలుగా సాగుతున్న శివపార్వతుల పెళ్లి విశ్వాసంతో మొదలై, ఆచారంగా పరిణమించింది. జీవనశైలిగా ఇక్కడ దర్శనమిస్తోంది. అలవికాని పేదరికం, తీవ్రమైన అనారోగ్యం, ఎదుగు బొదుగులేని జీవితం, నిరాశావహమైన భవిష్యత్తు వారిని దేవుణ్ణి పెళ్లి చేసుకునేలా చేస్తున్నాయి.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ...