భారతదేశం, ఏప్రిల్ 6 -- Vemulawada Srirama Navami : శ్రీరామనవమి సందర్భంగా అంతట సీతారాముల కల్యాణం జరిగితే వేములవాడలో వింత వివాహాలు జరిగాయి. రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో సీతారాముల కల్యాణ శుభముహూర్తాన శివపార్వతులు జోగినిలు (ట్రాన్స్ జెండర్స్) శివుడిని పెళ్లి చేసుకున్నారు. ఓవైపు సీతారాముల కల్యాణం జరుగుతుంటే మరోవైపు స్త్రీ పురుష వయోభేదం లేకుండా వేలాదిగా తరలివచ్చిన శివపార్వతులు జోగినీలు, చేతిలో త్రిశూలం, నెత్తిన జిలకర బెల్లం పెట్టుకుని పెళ్లికూతురులా తయారై దేవుడిని పెళ్లి చేసుకున్నారు.‌ త్రిశూలానికి భాషింగం కట్టి, మెడలో రుద్రాక్ష మాల, పసుపు కొమ్ము వేసుకొని ఒకరిపై మరొకరు అక్షంతలు చల్లుకుంటూ తలంబ్రాలు పోసుకుని దేవుడితో పెళ్లైనట్లు భావించారు.

దక్షిణకాశిగా పేరొందిన వేములవాడలో శ్రీరామనవమికి ఓ ప్రత్యేకత ఉంటుంది. రాజేరాజేశ్వరస్వామి సన్నిధిలో సీతారాముల...