భారతదేశం, ఏప్రిల్ 14 -- Vemulawada Murder: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని డ్రైవర్ గా పని చేసే నాగయ్యపల్లి గ్రామానికి చెందిన చెట్టిపల్లి పర్శరాం (39) దారుణ హత్యకు గురయ్యారు. తెలిసిన వ్యక్తే గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపాడు. హత్యకు పాత కక్షలే కారణమని భావిస్తున్నారు.

సిరిసిల్ల జిల్లతా వేములవాడకు చెందిన మృతుడు పర్శరాం వేములవాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బింగి మహేష్ వద్ద గత కొంతకాలంగా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మద్యం మత్తులో కొనాయిపల్లికి చెందిన బైరెడ్డి ఇంటికొచ్చి నమ్మించి బయటకు తీసుకెళ్లి మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్ వద్ద గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపాడని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. బైరెడ్డి గతంలో నాన్నకు స్నేహితుడేనని మృతుని కుమారుడు తెలిపారు. ఫోన్ చేసి బయటకు రమ్మని చెప్పి నమ్మించి హత్య చేశాడని చెప్పారు.

పర్శరాం హత్య...